Raghuveera Reddy On Political Re Entry: చాలా రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ సంచలన ప్రకటన చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఆయన రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ ఒక్కమాట అన్నందుకు లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం బాధ కలిగించిందని చెప్పారు. ఈ విషయం తన మననసు కలచివేసిందని అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను తప్పుకోవడం భావ్యం కాదని అనిపించిందన్నారు. అందుకే మళ్లీ ప్రజలకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయాల నుంచి విరామం తీసుకున్న రఘువీరా.. నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జోరుగా కొనసాగుతుండడంతో అధిష్టానం నుంచి రఘువీరాచకు పిలుపు వచ్చింది. బెంగుళూరు సిటీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రఘువీరా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. 


కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో బెంగుళూరుకు వెళ్లి అక్కడి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు రఘువీరా రెడ్డి. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడలేదని.. దేశంలో పెద్ద పెద్ద దొంగల పేరులో మోదీ ఉందని మాత్రమే అన్నారని గుర్తుచేశారు. అయితే కొందరు ఆ వ్యాఖ్యలను తప్పదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో శిక్షపడి నాలుగు, ఐదేళ్లు అయిన వాళ్లు కూడా ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారని.. రాహుల్ గాంధీపై ఎందుకు ఆఘామేఘాల మీద వేటు వేశారని ప్రశ్నించారు.


Also Read: Tax Saving Tips 2023: ఇలా చేయండి.. రూ.12 లక్షల జీతంపై ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన రఘువీరా.. మడకశిర నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ మినిస్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత రఘువీరాకు అధిష్టానం ఏపీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది. అయితే తరువాత ఆయన రాజకీయాలకు విశ్రాంతి ఇచ్చారు. రఘువీరా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావడంతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 


Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook