అమరావతి: వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి  దాఖలు  చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది. వైస్సార్సీపీ, పంచాయితీ కార్యాలయాలకు ఆ పార్టీ రంగులు వేయడాన్ని ఖండిస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈడీబీఎక్స్ సీఈవో, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగం చేసిన సీబీఐ కేసుపై హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిధులు దుర్వినియోగం చేసినట్లు ఇప్పటికే ‌ఆధారాలు సేకరించిన సీఐడీ, రేపు హైకోర్టుకు ఆధారాలు సమర్పించి, కృష్ణా కిషోర్ ను విచారణ కోసం సీఐడీ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఏపీలో స్థానిక ఎన్నికల జీవో 176ను నిలుపుదల చేయాలంటూ కర్నూలుకు చెందిన ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.


50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలుపై సుప్రీం కోర్టు అభ్యంతరాలు తెలపడంతో 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా, 50 శాతానికే పరిమితం చేయాలా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలపై హైకోర్టు తీర్పును గురువారం నాడు వెలువరించనుంది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..