విజయవాడ: దేశవ్యాప్తంగా పౌర విమానాశ్రయాలకు భద్రత కల్పించే కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ (సీఐఎస్‌ఎఫ్‌) త్వరలోనే షిర్డీ (మహారాష్ట్ర), జామ్‌నగర్‌ (గుజరాత్‌), విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌), జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌) ఎయిర్‌పోర్టులకు రక్షణ కల్పించనుంది.


ఈ నాలుగు విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని గతంలోనే  కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సిబ్బందిని ఇప్పటివరకూ కేటాయించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఐఎస్‌ఎఫ్‌ 59 పౌర విమానాశ్రయాలకు రక్షణ కల్పిస్తోంది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక విభాగమైన ఏవియేషన్‌ సెక్యూరిటీ గ్రూప్‌ హైజాకింగ్‌తో పాటు ఎయిర్‌పోర్టులపై ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా చర్యలు తీసుకుంటుంది.