Gangadhara Nellore MLA Politics: చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సికి రిజర్వేషన్ అయింది. జీడీ నెల్లూరు అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం అనే విషయం తెలుసు కదా.. గతంలో ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉండింది. అప్పటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున ఒకసారి, టీడీపీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ నియోజకవర్గం పరిస్థితులు తారుమారయ్యాయి. ఆ తరువాత వైసీపీకి తిరుగులేకుండా పోయింది. వరసగా నారాయణ స్వామి రెండుసార్లు గెలిచారు. జీడి నెల్లూరు అంటే వైసీపీగా మారిపోయింది. మళ్లీ త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జీడి నెల్లూరులో పొలిటికల్ హీట్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంగాధర నెల్లూరు నియోజకవర్గం చిత్తూర్ జిల్లాలో ఉంది. నారాయణ స్వామి రెండుసార్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎస్సీలు ఎక్కువగా ఉండడంతో ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వేషన్ అయింది. గత ఎన్నికల్లో గెలిచిన నారాయణ స్వామిపై కొంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు తన స్థానంలో కూతురు కృపాలక్ష్మిని నిలపెట్టాలని చూస్తున్నారు. ఇంకా టీడీపీకి కొత్తగా థామస్ అని డాక్టర్ కి సీట్ ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉంది. 


ఇప్పుడిప్పుడే టీడీపీకి ప్రాణం పోసుకునేందుకు జీడీ నెల్లూరులో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా జనసేనకి గతంలో పోటీ చేసిన యుగంధర్ మళ్లీ ఈసారి కూడా నిలబడి గెలవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో గట్టి పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రజల దగరకు నారాయణ స్వామి పోకపోవడం వల్లే వ్యతిరేకత వచ్చిందని.. అందుకని ఈసారి తన కూతురు కృపాలక్ష్మిని రంగంలోకి దింపి ఈసారి కూడా వైసీపీని గెలిపించుకోవాలి అని చూస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. కొంతమందికి పదవులు ఇవ్వక తనతోనే తిప్పుకుంటున్నారు అని ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 


నారాయణస్వామి వ్యతిరేక వర్గం ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి మరీ ఆయనపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితిలో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మికి సీట్ ఇస్తే అంత కలిసి పనిచేస్తారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. టీడీపీకి సరియిన అభ్యర్థి లేనందున ఈసారి కొత్తగా డాక్టర్ థామస్ తెరపైకి వచ్చారు. ప్రజల్లో అంతగా తెలియక పోయినప్పటికీ.. ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఈసారి ప్రజల్లో తిరిగి ఆర్థికంగా ప్రజల్లో ఖర్చుపెట్టి గెలవాలి అనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే థామస్ ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు అని అక్కడి జనం చెప్పుకుంటున్నారు.


ఇంకా జనసేన యుగంధర్ గత ఎన్నికల్లో ఐదు వేలు ఓట్లే వచ్చినప్పటికీ.. ఈసారి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని గెలిచేలా ప్రణాళికలు చేస్తున్నారు. నారాయణ స్వామిపై వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అండగా ఉంటున్నానన ప్రజల్లో తిరుగుతున్నారు. దీంతో ఈసారి యుగందర్ కి పోల్ అయ్యే ఓట్ల శాతం కొంత మేరకు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల విశేషణ. మొత్తానికి జిడి నెల్లూరులో టీడీపీకి, వైసీపీకి గట్టి పోటీ ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో అని ఉత్కంఠ ఉంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చేస్తోన్న టీడీపీ.. ఇంతకాలం పాటు వైసీపీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి చేయకుండా ఉన్న పనులను హైలైట్ చేసి ప్రజల్లో బలం పొందాలని టీడీపీ నాయకులు స్కెచ్ వేస్తున్నారు. ఏదేమైనా ఎవరి ప్రణాళికల్లో వాళ్లు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.