Gangavaram port: గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4శాతం వాటాను అదానీ  పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ సొంతమవుతోంది. ఈ వాటాను రూ.644.78 కోట్లకు తమకు విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 23న అనుమతి ఇచ్చినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌(Adani Ports and SEZ) వెల్లడించింది. ఈ లావాదేవీ ఒక నెలలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌(gangavaram port Limited) లో ఆ సంస్థ ప్రమోటర్‌ అయిన డీవీఎస్‌ రాజు(DVS Raju) నుంచి 58.1 శాతం వాటాను కొంతకాలం క్రితం అదానీ గ్రూపు(Adani Group) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  అంతకు ముందే ఈ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం(AP Government) వద్ద ఉన్న 10.4 శాతం వాటా కూడా దక్కడంతో ..గంగవరం పోర్ట్‌(gangavaram port)లో నూరుశాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లు అవుతుంది. 


Also Read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ తగ్గుదల


విశాఖపట్నం(Visakhapatnam)లోని గంగవరం పోర్ట్‌ గత దశాబ్దకాలంలో దేశానికి తూర్పుతీరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన పోర్టుల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 32.81 మిలియన్‌ టన్నుల సరకు రవాణా నమోదు చేసింది. తద్వారా రూ.1,057 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏటా 64 మిలియన్‌ టన్నుల కార్గో(Cargo)ను రవాణా చేయగల సామర్థ్యం ఈ పోర్టుకు ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook