Jagan Mohan Reddy House in Lotus Pond: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని జగన్మోహన్ రెడ్డి ఇంటిముందు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. జగన్ ఇంటిముందు ఉన్న అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీకి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులు వస్తున్నాయని వాహనదారులు ఆరోపించారు. ఏపీలో జగన్ ఓడిపోవడంతో సెక్యూరిటీ లేకుండా పోయింది. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం


ఏం జరిగిందంటే..?


లోటస్ పాండ్‌లో ఫుట్‌పాత్‌ను, రోడ్డును అక్రమించి.. నిర్మాణాలు చేపట్టారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ అధికారులకు సామాన్య ప్రజలు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. వరుస ఫిర్యాదులు రావడం.. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. లోటస్ పాండ్ వద్ద జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడా ఉన్నా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పరోక్షంగా హెచ్చరికలు పంపించింది. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో అక్కడ నిర్మించిన 3 షెడ్లను బుల్డోజర్ సాయంతో తొలగించారు. శిష్యుడు రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రివేంజ్ స్టార్ట్ చేశారని కామెంట్స్ వస్తున్నాయి.


Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి