GIS 2023: అంతా సిద్ధం, గ్లోబల్ సమ్మిట్ ఎలా ఉంటుంది, ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం
GIS 2023: ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అంతా సిద్ధమైంది. దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 45 దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం కళకళలాడనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే 18 వేల రిజిస్ట్రేషన్స్ దాటాయి. రెండ్రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశేషాలు ఇవీ..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఇవాళ, రేపు అంటే మార్చ్ 3, 4 తేదీల్లో జరగనుంది. 45 దేశాలు, దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 18 వేలకు పైగా ప్రతినిధులకు ఆతిధ్యమిచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది.
అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ, రేపు అంటే మార్చ్ 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ మూడ్రోజులపాటు విశాఖలోనే ఉండి అంతా పర్యవేక్షించనున్నారు. ఈ సమ్మిట్‌కు ఇప్పటికే 18 వేలకు పైగా ప్రతినిధుల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. 45 దేశాల్నించి ప్రతినిధులు రానున్నారు. 25 ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో విశాఖ చేరుకోనున్నారు పారిశ్రామికవేత్తలు. విమానాల పార్కింగ్ కోసం విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభం కానుంది. అతిధుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమంలో సదస్సు ఉంటుంది. రేజర్ షో, మా తెలుగు తల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీ ఛీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఈ సదస్సుకు కార్పొరేట్ దిగ్గజాలు ముకేష్ అంబానీ, అదానీ, కుమార మంగళం, సజ్జన్ జిందాల్, దాల్మియా, ఇతర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక సదస్సులుంటాయి. 20 బిజినెస్ స్టేషన్లు 150కి పైగా స్టాల్స్, 500 ద్రోన్లతో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.
తొలిరోజు కూడా కొన్ని ఒప్పందాలు పూర్తి కానున్నాయి. రెండవ రోజంతా ఎక్కువగా ఎంవోయూలే ఉంటాయి. ముఖ్యంగా 14 కీలకమైన రంగాల్లో పెట్టుబడులు భారీగా రానున్నాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆటోమొబైల్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా ఏపీకు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఒప్పందాలతో సరిపెట్టకుండా తక్కువ సమయంలో పెట్టుబడుల్ని కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోనున్నారు.
Also read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook