GMR Friendship: లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న స్నేహితుడి ఇంటికెళ్లి పరామర్శించిన గ్రంథి మల్లికార్జునరావు
GMR Friendship: స్నేహానికి ఎల్లలు లేవు. తారతమ్యాలు లేవు. స్నేహం విలువ తెలిస్తే ఏ స్థాయిలో ఉన్నా స్నేహితుడిని మర్చిపోం. అదే జరిగింది విశాఖపట్టణంలో.
ప్రముఖ ఇండియన్ మల్టీ నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు..అనారోగ్యంతో బాధపడుతున్నస్నేహితుడిని పరామర్శించి స్నేహం విలువ చాటుకున్నారు.
జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1978లో నెలకొల్పిన జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ ఎనర్జీ, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ ఇలా విభిన్న కంపెనీలు నడుపుతూ దేశంలోనే అగ్రస్థాయి పారిశ్రామికవేత్తగా ఉన్న వ్యక్తి గ్రంధి మల్లికార్జునరావు. రాజాం నుంచి 7 దేశాల్లో వ్యాపారాల్ని విస్తరించిన అగ్రగామి పారిశ్రామికవేత్త.
క్షణం తీరికలేని గ్రంధి మల్లికార్జునరావు..స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. తరచూ స్నేహితుల్ని కలుస్తుంటారు. ఆంధ్రా యూనివర్సిటీ అలూమ్ని బ్యాచ్ గెట్ టు గెదర్స్ జరిగితే..సాధ్యమైనంతవరకూ హాజరవుతుంటారు. ఎంత బిజీగా ఉన్నా స్నేహితుల్ని మరవరు. అదే ఆయన గొప్పతనం. ఏయూలో తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు విశాఖ పోర్టు ట్రస్ట్ రిటైర్డ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ అంబటి రాధాకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి క్షణం ఆగలేదు. విశాఖపట్నంలో రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంబటి రాధాకృష్ణ గత కొద్దికాలంగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్నారు.
నిన్న అంటే డిసెంబర్ 17వ తేదీన ఏయూ అలూమ్ని బ్యాచ్ గెట్ టు గెదర్‌కు హాజరైన గ్రంధి మల్లికార్జునరావు ఇవాళ అనారోగ్యంతా బాధపడుతున్న స్నేహితుడు అంబటి రాధాకృష్ణను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. కాస్సేపు మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చారు. వివిధ దేశాల్లో వ్యాపారాలతో బడా పారిశ్రామికవేత్తగా ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావు స్నేహానికి ఇచ్చిన విలువ చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook