Godavari Floods: గోదావరి మహోగ్రరూపం..ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద హై అలర్ట్..!
Godavari Floods: గోదావరి ఉగ్ర రూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో..ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు.
Godavari Floods: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ముసురు పట్టుకుంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇటు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 19.70 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
కంట్రోల్ రూమ్ నుంచి వరద పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. ఒక వేళ అలా జరిగితే 6 జిల్లాల్లో 44 మండలాల్లో 628 గ్రామాలపై ప్రభావం పడనుంది. ముందస్తుగా అదనపు సహాయక బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్‌ఎఫ్, 10 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, కోనసీమ జిల్లాలో 2 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఏలూరు జిల్లాలో 1 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు సంస్థ హెచ్చరించింది.
Also read:Hyderabad Traffic: ఎల్లుండి సికింద్రాబాద్‌లో బోనాల జాతర..ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook