తెలంగాణ - ఏపీ సరిహద్దుల్లో కారులో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు పట్టివేత
ఖమ్మం-క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లో తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు తరలిస్తుండటాన్ని గుర్తించారు.
హైదరాబాద్ : ఖమ్మం-క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లో తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు తరలిస్తుండటాన్ని గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కారులో తరలిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రాకు ఈ సొమ్మును తరలిస్తూ వాళ్లు తిరువూరు పోలీసులకు పట్టుబడ్డారు. ( Read also : Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ ఈ లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారు : ఏజీ సుబ్రహ్మణ్య శ్రీరామ్ )
కారుతో సహా పట్టుబడిన వారి నుంచి 1కిలో 53 గ్రాముల బంగారం, 9 కిలోల 450 గ్రాముల వెండి, 53 లక్షల 28,500 రూపాయల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. మొత్తం పట్టుబడిన నగదు, బంగారం విలువ రూ కోటి, ముప్పై ఏడు లక్షల, 65 వేల 975 ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..