ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతి నిరుద్యోగులకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు వారికి ఉపాధి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం కోసం ఓ వెబ్ సైటుని ప్రారంభించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులెవరైనా ఈ వెబ్ సైటు ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తమ బయోడేటా మొదలైన వివరాలు కూడా ఇందులో పొందుపరచుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వెబ్ సైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన తాజా ప్రకటనలను పొందుపరుస్తామని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు  ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ వెబ్ సైటును www.apbccms.in లింక్ ద్వారా సందర్శించవచ్చు. ఈ వెబ్ సైటులో జాబ్ మేళాల వివరాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని బీసీల సంక్షేమ శాఖ తెలియజేసింది. ఈ వెబ్ సైట్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800 425 6596లో సంప్రదించవచ్చు.