AP Govt: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల విడుదల అయిన పంటల బీమా పరిహారం అందని రైతులకు మరో అవకాశం కల్పించింది. ఖరీప్‌-2021 సీజన్ బీమా అందని రైతులు ..రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏ(VVA)ల వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి..దశల వారీగా అర్హులైన వారందరికీ పరిహారం అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదైన పెండింగ్ దరఖాస్తుల ఈకేవైసీ, దరఖాస్తుల ధృవీకరణను జూలై 15లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఖరీఫ్‌-2021లో పంట నష్టపోయిన రైతులందరికీ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం అందిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ తెలిపారు. పంటల బీమాపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు.


రాష్ట్రంలోనే పంటల బీమా పరిహారం అనంతపురం జిల్లాకు అత్యధికంగా రావడం సంతోషంగా ఉందన్నారు. వేరుశనగ పంటకు బీమా రాలేదన్న ఫిర్యాదులు వచ్చాయని..ఈ-క్రాప్ నిబంధనల ప్రకారం అన్ని పంటలకు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం పంటల బీమా పరిహారం అందించింది. ఖరీఫ్-2021లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం రూ.2977.82 కోట్లు మంజూరు చేసింది.


Also read: Rain Alert: వేగం పుంజుకున్న నైరుతి గాలులు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!


Also read:1998 DSC JOBS: ఆరుగురు సీఎంలు చేతులెత్తేశారు.. సీఎం జగన్ చేసి చూపించారు?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook