APPSC Notification 2023: ఏపీలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో చాలాకాలంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతర నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. వివిధ వర్శిటీల్లో మొత్తం 3,220 పోస్టుల భర్తీకై ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త విన్పించింది. అదే సమయంలో యూనివర్శిటీల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. చాలాకాలంగా రాష్ట్రంలో వివిధ విశ్వ విద్యాలయాల్లో  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటిని మొత్తం 3,220 ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకై ఉన్నత విద్యామండలికి చెందిన జాయింట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. గతంలో ఒక్కో యూనివర్శిటీకి ఒక్కో అప్లికేషన్ పెట్టాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రవేశ రుసుముకు ఎక్కువ ఖర్చయ్యేది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటికీ కలిపి ఒకే అప్లికేషన్, ఒకటే ఫీజు ఉంటుంది. 


అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 2500, ఎస్టీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు 2 వేలు, ఎన్ఆర్ఐ‌లు 4,200 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగరీ అభ్యర్ధులకు 3 వేలు, ఎన్ఆర్ఐలకు 12,600 రూపాయలు ఫీజు చెల్లించాలి. 


రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో మొత్తం 3,220 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 801, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2001 ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ నవంబర్ 20 కాగా, పోస్టు ద్వారా అయితే నవంబర్ 27 వరకూ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హత పొందినవారి జాబితాను నవంబర్ 30న వెలువరించనున్నారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 7లోగా తెలియపర్చాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్ధుల వివరాలు డిసెంబర్ 8న ఉంటాయి.


కాంట్రాక్ట్ పద్ధతిలో ఇప్పటికే పనిచేస్తున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. అధ్యాపక పోస్టుల భర్తీ తరువాత నాన్ టీచింగ్‌కు సంబంధించి 4,330 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. యూనివర్శిటీల చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఖాళీలు భర్తీ చేయడం 17 ఏళ్ల తరువాత ఇదే.


Also read: AP Investments: రాష్ట్రంలో 20 వేల కోట్లతో కొత్త పరిశ్రమలు, 70 వేల ఉద్యోగాలు..సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook