Glass Symbol: ఈసారి అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గాజు గ్లాస్‌ గుర్తు లభిస్తుందా లేదా అనే చర్చ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం జనసేనకు సానుకూలంగా స్పందించింది. జనసేన పార్టీకి కామన్‌ సింబల్‌గా 'గాజు గ్లాసు' కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌ 


అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకటన విడుదలైన కూడా జనసేన పార్టీకి గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్‌రిజర్వ్‌డ్‌ జాబితాలో గాజు గ్లాసును పేర్కొనడంతో ఆ గుర్తు లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా


ఆ గుర్తు ఎలాగైనా తమకు దక్కేలా జనసేన పార్టీ తీవ్రంగా కృషి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. నిరంతరం ఈసీతో సంప్రదింపులు చేస్తూ చివరకు ఆ గుర్తును దక్కేలా జనసేన చేసిన కృషి ఫలించింది. ఇక సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు చెందిన 'జై భారత్‌ నేషనల్‌ పార్టీ'కి టార్చ్‌ లైట్‌ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో టార్చ్‌లైట్‌ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


జోష్‌లో జన సైనికులు
పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కాకతాళీయంగా జనసేన పార్టీకి గాజు గ్లాస్‌ గుర్తు వస్తోంది. దీంతో జనసేన అంటేనే గాజు గ్లాసు గుర్తుకు వస్తుంది. అంతలా ప్రజల్లో గుర్తింపు పొందిన గాజు గ్లాసు అన్‌ రిజర్వ్‌డ్‌ జాబితాలో వెళ్లడంతో జనసైనికులు ఆందోళన చెందారు. ఆ గుర్తు రాకుంటే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర ప్రభావం ఉంటుందని గ్రహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎలాగైనా ఆ గుర్తు రావాలని పార్టీ పట్టుబట్టింది. నిరంతరం ఈసీతో సంప్రదింపులు చేస్తూ ఢిల్లీ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ప్రకటన నామినేషన్లు దాఖలు పూర్తయిన సమయంలో ఎట్టకేలకు 'గాజు గ్లాసు' గుర్తు జనసేనకు దక్కింది. తమ గుర్తు లభించడంతో జనసేన పార్టీ సైనికులు సంబరాల్లో మునిగారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter