ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో పేద, మధ్య తరగతి జనాలకు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో  సంక్షేమానికి పెద్దపీట వేసే కార్యక్రమాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఇల్లు కల్పించే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.9 కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోందని.... నిర్మాణ పనులు వేంగంవంతం చేసే చర్యలో భాగంగా ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించామని ఆర్ధికమంత్రి సభలో తెలిపారు.


ఇక మధ్య తరగతి వారి విషయానికి వస్తే మధ్య తరగతి వారికీ సొంటికల కలగానే మిగిలిపోతుందన్న మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య తరగతి వారి ప్రయోజనాల దృష్ట్యా ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ రీత్యా..ఇతర కారణాల రీత్యా పట్టణాల్లో నివాసముంటున్న మిడిల్ క్లాస్ వారికి ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉంటున్న వారికి అద్దెలు పెను భారంగా మరాయి. అలాంటి వారి ఇబ్బందులను సభలో ప్రస్తావించిన మంత్రి... అద్దె భారాన్ని తగ్గించే చర్యలో భాగంగా త్వరలో  ''ఆదర్శ అద్దె విధానం'' అమలు చేస్తామని ఆర్ధి మంత్రి సీతారామన్ ప్రకటించారు.