ఏపీలో మూడోవిడత రుణమాఫీ షురూ
మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో జరిగే కార్యాక్రమంలో పాల్గొని అర్హులైన రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. కాగా మాఫీ ప్రక్రియను వెంటనే అమలయ్యేలా ఇప్పటికే బ్యాంకర్లకు ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మూడో విడత రుణమాఫీ కోసం ఏపీ సర్కార్ రూ. 3,600 కోట్లు విడుదల చేసింది. ఈ విడతలో భాగంగా రెండు సంవత్సరాలకు వార్షిక 10% వడ్డీతో కలిపి సొమ్ము జమచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36.72 లక్షల మంది రైతు ఖాతాలకు ఈ సొమ్ము జమకానుంది. రైతులు, ప్రభుత్వం జారీచేసిన రుణ ఉపశమన పత్రాల నకలును అందించిన తరువాత మాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు. దేశ చరిత్రలోనే 24 వేల కోట్ల రూపాయల రైతు రుణ ఉపశమనం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని టీడీపీ నాయకులు అన్నారు.
* ఇప్పటివరకు 14,710 కోట్ల (3వ విడతతో కలిపి) రూపాయలను రుణ ఉపశమనం కింద లబ్ధిదారుల ఖాతాలో జమ
* లబ్ది పొందిన పంట ఋణము ఖాతాల సమాఖ్య 57. 57 లక్షలు
* ఉద్యాన పంట రుణ ఉపశమనం రూ. 384. 47 కోట్లు
* రూ. 4495 కోట్లతో, రూ. 50 వేళా లోపు రుణాలు తీసుకున్న 23. 45 లక్షల రైతు ఖాతాలకు ఒకేసారి రుణ ఉపశమనం
* రుణ ఉపశమనంలో కౌలు రైతులకూ ప్రాధాన్యత ఇవ్వబడింది
* మరణించిన రైతుల ఖాతాలకు కూడా రూ. 51. 54 కోట్ల పూర్తి రుణ ఉపశమనం కల్పించబడింది
* ధ్రువీకరణ పాత్రలు ఇవ్వక అర్హత కోల్పోయిన రైతులకు అవకాశము కల్పించి ఇప్పటికీ కూడా పూర్తి పారదర్శకతతో రుణ ఉపశమనంనకు చేయూత