Girl Prostitution Case: అమ్మాయితో వ్యభిచారం.. ఇరుక్కుపోయిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు
Girl Prostitution Case Incident: ఒక అమ్మాయికి కరోనా నయం చేయిస్తానంటూ తీసుకెళ్లి మహిళ.. ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపడం.. అలాగే ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
Girl Prostitution Case Incident: ఒక అమ్మాయికి కరోనా నయం చేయిస్తానంటూ తీసుకెళ్లి మహిళ.. ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపడం.. అలాగే ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
Guntur Prostitution: బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీకి (YSRCP) చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు (Former Minister Follower) కన్నా భూశంకరరావు ఈ కేసులో చిక్కుకున్నారు. బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు (Police) మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొవిడ్ బారిన పడిన ఒక బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్‌లో గుంటూరు (Guntur) ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలిక తల్లి చనిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులను తండ్రే చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పరిచయమైన ఒక మహిళ ఆ బాలికకు కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటు వైద్యం చేయిస్తానంటూ... బాలిక తండ్రికి మాయమాటలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కూతుర్ని ఆ మహిళ వెంట పంపించాడు.
అయితే ఆ బాలికకు కరోనా (Corona) తగ్గిపోయాక.. సదరు మహిళ ఆ అమ్మాయిని వ్యభిచారంలోకి దింపింది. ఏపీలోని పలు ప్రాంతాలకు ఆ బాలికను తీసుకువెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఇక ఈ నేపథ్యంలో విజయవాడలో ఆమె నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక పేరేచర్లలో ఉంటోన్న తన తండ్రి వద్దకు చేరుకుని మేడికొండూరు పోలీస్ స్టేషన్‌లో (Police Station) ఫిర్యాదు చేసింది.
అక్కడి పోలీసులు కేసును అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక బాలికను పోలీసులు విచారించడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యభిచార ముఠాలో (Prostitution Gang) మొత్తం 45 మందికి పైగా ఉన్నట్లు తేలింది.
ఇక ఈ కేసు విచారణలో వ్యభిచార నిర్వాహకులు, విటుల్ని కూడా అరెస్టు చేయాలంటూ జడ్జి ఆదేశించడంతో తాజాగా పలువురు అరెస్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే ఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావును అరెస్ట్ చేశారు. ఇలా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశామంటూ పోలీసులు వెల్లడించారు.
Also Read: Trolls on Anasuya: రిపబ్లిక్ డే వివాదంలో స్టార్ యాంకర్
ఇక గుంటూరులో బాలికపై (Guntur Girl) లైంగిక దాడికి పాల్పడిన భూశంకరరావు వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరుడే అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై (Incident) లోకేశ్ సీరియస్ అయ్యారు.
Also Read: Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook