సామాన్యుడికి స్పల్ప ఊరట ; తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సామాన్యుడికి స్పల్ప ఊరట లభించింది. వరుసగా ఎనిమిదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ రోజు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 5 పైసల మేరకు ధర తగ్గింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధర తగ్గడంతో ఈ మేరకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
తాజా ప్రకటనతో హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.98, డీజిల్ రూ. 81.36కి తగ్గింది. మన పొరుగు రాష్ట్రం చెన్నైలో పెట్రోల్ ధర రూ 84.28 డీజిల్ రూ 79.09కి తగ్గింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 81.10కి, డీజిల్ రూ.74.80కి తగ్గింది. కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 82.92 డీజిల్ ధర రూ. 76.65కి తగ్గింది. ఇక ముంబై విషయానికి వస్తే పెట్రోలు ధర రూ. 86.58కి, డీజిల్ రూ. 78.41కి తగ్గింది.
ప్రాంతం | లీటర్ పెట్రోల్ ధర | లీటర్ డీజిల్ ధర |
హైదరాబాద్ | రూ. 85.98 | రూ. 81.36 |
చెన్నై | రూ 84.28 | రూ 79.09 |
ఢిల్లీ | రూ. 81.10 | రూ.74.80 |
ముంబై | రూ. 86.58 | రూ. 78.41 |
కోల్ కతా | రూ. 82.92 | రూ.76.65 |
వరుగా 8వ రోజు తగ్గిన ధరలు
గత ఎనిమిది రోజుల నుంచి గమనించినట్లయితే పెట్రోల్ ధర క్రమంగా రూ.1.73 వరకు తగ్గింది . అక్టోబర్ 17కు ముందు దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.82.83గా ఉంది. ప్రస్తుతం రూ. 81.10గా ఉంది. ఇక డిజిల్ విషయానికి వస్తే గత ఎనిమిది రోజుల్లో 89పైసలు తగ్గింది. గత ఎనిమిది రోజుల క్రితం డీజిల్ ధర 75.69 గా ఉండేది. ప్రస్తుత ధర రూ.74.80గా ఉంది.