New DGP of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఈ నెల 31న పదవీ విరమణ చెయ్యను ఉండగా.. ఆయన తరువాత హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా.. ఆయన వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించుకోవడంతో పాటు..గతంలో ఆయనపై కొన్ని ఆరోపణలు రావడం వల్ల ఈ పదవికి ఆయనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.  


దీంతో, రెండవ స్థానంలో ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చెయ్యడం జరిగింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా.. విధులు నిర్వహిస్తున్నారు.  హరీష్ కుమార్ గుప్తా గతంలో కూడా తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో… అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేయగా..ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కొంతకాలం ఆయన డీజీపీగా కొనసాగారు.  
  
ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం…ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన డీజీపీగా ఉంటూనే ఆర్టీసీ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు.  


హరీష్ కుమార్ గుప్తా పదవీ కాలం.. ఈ ఏడాది ఆగస్టు వరకు ఉంటుంది. అవసరమైతే మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  


పిటిషన్ ప్రకారం, సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపాలని నిబంధనలు సూచిస్తున్నాయి. కాగా ముగ్గురు అధికారుల జాబితా పంపినా, వారిలో ఎవరికీ కాకుండా మరొకరిని డీజీపీగా ఎలా నియమించారని పిటిషనర్ ప్రశ్నించారు. అయితే, సుప్రీంకోర్టులో విచారణ పెండింగులో ఉన్నందున, హైకోర్టు ఈ కేసును తిరస్కరించింది.


Also Read : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..


Also Read: Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.