Diabetes Tips: రోజూ తినే ఆహార పదార్ధాల్లో ఈ మార్పులు చేస్తే చాలు కేవలం 5 వారాల్లో మధుమేహానికి చెక్
Diabetes Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. నియంత్రణే తప్ప పూర్తిగా చికిత్స లేని వ్యాధి కావడంతో ఆహారపు అలవాట్లపై ప్రత్యక శ్రద్ధ చాలా అవసరం
Diabetes Tips: ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తుతున్న వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది. డయాబెటిస్. ఓ అధ్యయనం ప్రకారం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం వ్యాధి ఉంటుందని తెలుస్తోంది. మధుమేహాన్ని చాలా సులభమైన పద్ధతుల్లో చెక్ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.
మధుమేహం చాలా ప్రమాదకరం. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంటూనే ఉంటుంది. మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. రోజూ తినే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. డయాబెటిస్ నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందే సఫలమౌతుంటారు. అయితే ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు.
డయాబెటిస్ అనేది మనిషిని నిలువునా దహించేస్తుంది. ఇది ఎంత ప్రమాదకర వ్యాధో..జాగ్రత్త వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటే అంత సులభంగా నియంత్రించవచ్చు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం కానీ అదుపులో ఉంచుకోవచ్చు. తినే ఆహార పదార్ధాల్లో జాగ్రత్తలు, వాకింగ్, వ్యాయామం వంటి వాటిద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు..మధుమేహం కారణంగా మూత్రపిండాల సమస్య ఎదురవుతుంది.
కీరా జ్యూస్
వేసవిలో సమృద్దిగా లభించడమే కాకుండా డయాబెటిస్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లభించే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బీ1, ఎమైనో యాసిడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్స్ విడుదల సరిగ్గా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే వారానికి కనీసం 3-4 సార్లు వినియోగిస్తుండాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. దీంతోపాటు రోజుకు కనీసం అరగంట వ్యాయామం తప్పకుండా ఉండాలి.
గ్రీన్ టీ ప్రయోజనకరం
మధుమేహం వ్యాధిగ్రస్థులకు గ్రీన్ టీ ఓ దివ్యౌషధం అనడంలో సందేహం అవసరం లేదు. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండటంతో శరీరానికి మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వారికి చాలా మంచిది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ సేవిస్తే చాలా త్వరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో వచ్చేస్తాయి.
కాకరకాయ-బీట్‌రూట్ జ్యూస్
మధుమేహం నియంత్రణలో కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమౌతాయి. దీంతోపాటు బీట్‌రూట్ జ్యూస్ కూడా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించి రక్త హీనతను కూడా దూరం చేస్తుంది.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లనేవి చాలామందికి ఇష్టం. వివిధ రకాల వ్యాధులను దూరం చేయడంలోనే కాకుండా మధుమేహం నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ కారణంగా అలసట అనేది ఉండదు. అదే సమయంలో ఎనర్జీ వృద్ధా కాదు.
Also read: Health Tips: పరగడుపున ఏయే పదార్ధాలు తినవచ్చు, ఏవి తినకూడదు
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook