Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక
Telangana Rain ALERT: తెలంగాణ రాష్రంలో నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి బేసిన్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూలై చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా కుంభష్టి కురుస్తోంది. అటు మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంటగంటకు గోదావరిలో వరద పెరిగిపోతోంది
Telangana Rain ALERT: తెలంగాణ రాష్రంలో నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి బేసిన్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూలై చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా కుంభష్టి కురుస్తోంది. అటు మహారాష్ట్రలోని గోదావరి పరివాహక ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు గోదావరిలో వరద పెరిగిపోతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూలై రెండోవారంలోనే ఎస్సారెస్పీ గేట్లను ఎత్తారు. దిగువ గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. సోమవారం ఉదయం ఏడు గంటల సమయానికి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. అటు ఛత్తీస్ గడ్ నుంచిభారీగా వరద వస్తోంది. దీంతో భద్రచాలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద సోమవారం ఉదయం ఆరు గంటలకు గోదావరి నీటిమట్టం 49 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింతగా పెరగవచ్చని సీడీబ్ల్యూసీ అలర్ట్ చేసింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 11,39,230 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. వాజేడు మండలం టేకులగూడెం గ్రామ సమీపంలోని లోలెవల్ బ్రిడ్జి పూర్తిగా గోదావరి నీట మునగటంతో, తెలంగాణ చత్తీస్ గడ్ రాష్ట్రలకు రాక పోకలు నిలిచిపోయాయి.భద్రాచలం నుంచి వస్తున్న వరదకు శబరి తోడైంది. శబరి నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం దగ్గర గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. [[{"fid":"237540","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మికంగా భారీ వరద వచ్చింది. పోలవరానికి జూలైలో మాములుగా 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుంటుంది. కాని ఈసారి జూలై రెండో వారంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. సోమవారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే గేట్లు ద్వారా 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపించారు. సోమవారం సాయంత్రానికి వరద 12 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు గండం ఉందనే ప్రచారం సాగుతోంది.పోలవరం స్పిల్ వే దగ్గర 30.1మీటర్లకు చేరింది గోదావరి నీటిమట్టం. గంటగంటకు ఇది పెరిగిపోతోంది. ఆకస్మిక వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దిగువ కాఫర్ డ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం 19.5 మీటర్లకు చేరింది. దిగువ కాఫర్ డ్యాం 21 మీటర్లఎత్తుకు పూర్తైంది.గంటకు 25 సెంటిమీటర్ల చొప్పున నీటిమట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుడంటంతో దిగువ కాఫర్ డ్యాం, ,గ్యాప్-2 పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
Read also: KCR VS Bandi Sanjay: టీఆర్ఎస్ లో ఏకనాథ్ షిండేలున్నారు.. అందుకే కేసీఆర్ కు భయం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook