Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో  జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి గోదావరి జిల్లాల్లో కుండపోతగా వాన కురిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కాకినాడలో దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమండ్రి, తాడేపల్లిగూడెంలో భారీ వర్షం పడింది. కోనసీమ, తుని, తణుకు, మచిలిపట్నం, విజయవాడ, కైకలూరు, గుంటూరు లోనూ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి విశాఖపట్నంలోనూ భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.


గత 24 గంటల్లో ఏపీకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, ప్రకాశం జిల్లా రాచర్లలో అత్యధికంగా 9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగమహేశ్వరం, విజయనగరం జిల్లా కొమరాడలో 7 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 6 సెంటిమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కళింగపట్నం, విజయనగరం జిల్లా కురుపాం, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఐదు సెంటిమీటర్ల వర్షం కురిసింది. అల్పపీడనం ప్రస్తుతం మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో  మరో ఉపరితల ఆవర్తనం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.


తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్. నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నిజామాబాద్ జిల్లా మండోరాలో 108 మిలిమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 104, సంగారెడ్డి జిల్లా కంగ్లిలో 102, నాగర్ కర్నూల్ జిల్లా తోటపల్లిలో 96 మిల్లిమీటర్ల వర్షపాతం రికార్జైంది. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 


అల్పపీడనం ప్రస్తుతం మధ్య ప్రదేశ్ మధ్య భాగం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో  మరో ఉపరితల ఆవర్తనం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్. నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నిజామాబాద్ జిల్లా మండోరాలో 108 మిలిమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 104, సంగారెడ్డి జిల్లా కంగ్లిలో 102, నాగర్ కర్నూల్ జిల్లా తోటపల్లిలో 96 మిల్లిమీటర్ల వర్షపాతం రికార్జైంది.తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook