Munneru Floods: మున్నేరు వరద ఉధృతి, విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు, రహదారి బంద్
Munneru Floods: తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. వరుసగా మూడ్రోజుల్నించి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరద కారణంగా మున్నేరు వాగు జాతీయ రహదారెక్కేసింది.
Munneru Floods: భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ సమీపంలో నేషనల్ హైవే నెంబర్ 65 జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిపిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
గత మూడు నాలుగు రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో ఉన్న మున్నేరు వాగు పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా వాగుకు అవతల చిక్కుకున్న 13 మంది రైతులు, కూలీల్ని ఎన్టీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. మున్నేరు వాగు ఉధృతి పెరగడంతో నందిగామ నియోజకవర్గ పరిధిలోని ఐతవరం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి 65పైనుంచి రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో హైవే జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు దగ్గరుండి వన్ వేలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మున్నేరు వాగు ఉధృతి కారణంగా జాతీయ రహదారిపై 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మున్నేరు వాగుకు, వైరా, కట్టలేరు తోడవడంతో వరద ఉధృతి మరింతగా పెరిగింది. వరద మరింత పెరగవచ్చని అంచనా. దాదాపు లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు మున్నేరు వాగులో ప్రవహిస్తోందని అంచనా. వరద తగ్గేంతవరకూ బస్సులు నడపలేమని ఆర్టీసీ డ్రైవర్లు చేతులెత్తేశారు. ఫలితంగా బస్సుల్లోని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ మీదుగా వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు. అటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల్ని గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా మళ్లిస్తున్నారు.
Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook