AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో విపత్తుల సంస్థ అప్రమత్తమైంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని..మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వర్షాలు, వదరలతో విపత్తుల సంస్థ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏ ప్రాంతంలోనైనా వరదలు అధికంగా ఉంటే తమకు సమాచారం అందించాలని విపత్తు సంస్థల అధికారులు వెల్లడించారు. 24 గంటలపాటు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఇందుకోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసరం ఉంటే 1070, 18004250101,08632377118 నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొన్నారు.


Also read:India vs Zimbabwe: వచ్చే నెల జింబాబ్వేకు టీమిండియా..కెప్టెన్, కోచ్‌ ఎవరో తెలుసా..?


Also read:Telugu States Rains Live Updates: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook