Heavy rains in AP: అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ దిశగా పయనిస్తోన్న ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కారు (AP govt) సైతం సంబంధిత ప్రాంతాల్లోని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 


Also read : Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలపై ఏపీ సర్కారుకి Pawan Kalyan ప్రశ్నలు


Heavy rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలకు వాగులను తలపిస్తున్న రోడ్లు
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలోనూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల వాగులు. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు సైతం వాగులను తలపిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోగా.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా జన జీవనం పూర్తి అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా (Heavy rains) వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (NDRF teams) రంగంలోకి దిగాయి.


Also read : Heavy rains updates: ఈ జాబితాలోని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. IMD నివేదిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook