బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ వాతావరణ కేంద్రం మేరకు.. ఇవాళ ఏర్పడే అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, దక్షిణ ప్రాంతాల్లో తీరం వైపు వచ్చే అవకాశముంది. దీని ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కరుస్తాయి. తీరంవైపు వాయుగుండం వచ్చే కొద్దీ కోస్తాలో వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణుల అంచనా. అటు తెలంగాణలో ఇవాళ అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని.. గురు, శుక్రవారాల్లో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


ఇదిలా ఉండగా.. సోమవారం తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్, అనంతరపురం, కర్నూలు, ఒంగోలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు.


మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ మరో 2 వారాల్లో ముగుస్తుందనగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.