Heavy rains predicted in Andhra Pradesh: ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం ప్రభావంతో కోస్తాంధ్ర (Coastal Andhra) తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకి వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ సర్కారు (AP govt).. తీర ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. జాలర్లు వేటకు వెళ్లకుండా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీచేశారు. 


Also read : Online sex racket: తిరుపతిలో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు


ఇదిలావుంటే, ఇదే అల్ప పీడనం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains in Telangana) కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.


Also read : AP Night Curfew: ఏపీలో మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook