తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రస్తుతం కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది.