secrete camera in washroom gudlavalleru incident: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది. కాలేజీలోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి అనేక ఫోటోలు, వీడియోలను ఫోన్ల లో పంపించుకున్నారంటూ కొంత  మంది విద్యార్థినులు ఆరోపించారు. గురువారం.. అర్ధరాత్రి నుంచి వీరి నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈ ఘటన కాస్త పెద్ద దుమారంగా మారింది. వేలాదిగి మహిళలు, విద్యార్థినులు కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. అంతేకాకుండా.. ఈ ఘటనలో కారణమైనట్లు అనుమానిస్తున్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మరోవైపు ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా.. విచారణకు ఆదేశించారు. ఘటన స్థలంలో మంత్రి కొల్లురవీంద్ర, కలెక్టర్ ,ఎస్పీ చేరుకున్నారు. దీనిమీద విద్యార్థినులు వాదనలు విన్నారు. అంతేకాకుండా.. ఒక మహిళ ఏసీపీ అధికారిణి, ముగ్గురు పోలీసులతో కూడిన కమిటిని సైతం ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా.. దీనిపైన కొంత మంది లేని పోనీ పుకార్లంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.


కొంతమంది లవర్స్.. తమ మధ్య వచ్చిన గొడవల వల్ల ఈ ఘటనను తెరమీదకు తెచ్చారంటూ కూడా వార్తలలో వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ లీడర్ షర్మిలా సైతం స్పందించారు. ఈ క్రమంలో దీనిపై అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున కాలేజీ ఎదుట తమ నిరసనలు తెలియజేస్తున్నారు.


ఈ క్రమంలో మంత్రులు, కలెక్టర్ , ఎస్పీ హమీ ఇవ్వడంతో స్టూడెంట్స్ వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. తమకు న్యాయంచేయాలిన, కాలేజీలోకి వెళ్లాలంటే భయంగా కూడా ఉందని కూడా విద్యార్థినులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉండగా.. బాత్రూమ్ లో కామెరా ఘటనలో మరో వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


Read more: Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..


కొంత మంది విద్యార్థినులు తమ బాత్రూమ్ లలోని షవర్ లలో.. సీక్రెట్ కెమెరాలను పెట్టారంటూ కూడా చెబుతున్నారు. దీంతో మహిళ కానిస్టేబుల్ లు విద్యార్థుల బాత్రూమ్ ల దగ్గరకు చేరుకుని షవర్ లను పరిశీలించారు. షవర్ కు పెట్టే క్లిప్ ఓపెన్ చేసి ఉండటం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఈ క్రమంలో పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరోవైపు  ఈ ఘటనను కొంత మంది కావాలని పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా బాధితు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.