High court lawyer complained against mohan babu: మంచు కుటుంబంలోని తగాదాలు ప్రస్తుతం రోడ్డునపడినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా గత రెండు, మూడు రోజులుగా జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదుచేయడం,మోహన్ బాబు సీపీకి మనోజ్ మీద ఫిర్యాదుచేయడం, ఆ తర్వాత మంచు మనోజ్ మళ్లీ. .తెలుగు రాష్ట్రాల సీఎంలు,డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీలకు ఎక్స్ వేదికగా టాగ్ చేసిన విషయం తెలిసిందే. ఎవరికి వారు ప్రైవేటుగా బౌన్సర్ లను సైతం నియమించుకుని దాడులు చేసుకున్నట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మోహన్ బాబు జల్ పల్లి వద్ద రెండు రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అదేవిధంగా మనోజ్ గేట్ తెరిచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడున్న విష్ణు బౌన్సర్ లు  దాడులు చేసినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడకు చేరుకున్న.. మోహన్ బాబు కంట్రోల్ తప్పి.. ఒక రిపోర్టర్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను తీవ్రంగా గాయపడ్డారు.


తలకు ఫ్యాక్చర్ సైతం అయ్యినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సీపీ మోహన్ బాబుపై కేసును నమోదు చేసుకుని ఆయన వద్ద నున్న గన్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. తమ ముందు హజరు కావాలని నోటీసులు జారీచేశారు. అయితే.. కోర్టుకు వెళ్లి మోహన్ బాబు.. డిసెంబరు 24 వరకు ఉపశమనం తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ పై దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు.. తెలంగాణ మంత్రులుసైతం ఖండించారు.


ఈక్రమంలో తాజాగా.. ఈ ఘటనపై మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును సైతం నమోదు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. తాజాగా.. మోహన్ బాబు కుటుంబం  నాటకాలు చేస్తుందని.. కేవలం మంచు విష్ణు మూవీ.. కన్నప్ప ప్రమోషన్ ల కోసమే ఈ నాటకాలు చేస్తున్నారని హైకొర్టు లాయర్ అరుణ్ కుమార్ పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.


Read more: Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్‌ షాక్‌.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్‌ ఒపీనియన్‌తో మార్పు..


వెంటనే మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లపై క్రిమినల్ కేసుల్ని సైతం నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది. దీనిపైన పోలీసుల ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మంచు మోహన్ బాబుకు మాత్రం.. ఇవి వరుస షాక్ లుగా చెప్పుకొవచ్చు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.