Jagan Illegal Assets Case: ఎంపీ రఘురామ పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు...
Telangana HC on CM Jagan Illegal Assets Case: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana HC on CM Jagan Illegal Assets Case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన పిల్‌పై నేడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ పిల్‌కు నంబర్ కేటాయించాలని కోర్టు ఆదేశించింది. అయితే పిల్ విచారణార్హతను తేల్చాల్సి ఉందని పేర్కొంది. పిల్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల విచారణ అసమగ్రంగా ఉందని రఘురామ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని.. ఆయన బెయిల్ రద్దు చేసి వాటిని విచారించాలని పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని కోరారు. అయితే సీబీఐ కోర్టు రఘురామ పిటిషన్‌ను కొట్టిపారేసింది.
సీబీఐ కోర్టులో చుక్కెదురైనా రఘురామ వెనక్కి తగ్గలేదు. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు రిజిస్ట్రీ దాన్ని అనుమతించలేదు. తాజాగా ఆ పిల్ విచారణార్హతను తేల్చాలని.. దానికి నంబర్ కేటాయించాలని ఆదేశాలిస్తూ సీజేఐ నేత్రుత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read: Fake Cigarettes in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ సిగరెట్ల దందా.. రూ.2 కోట్ల విలువైన సరుకు సీజ్..
Also Read: ఆలియా హాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న గంగూబాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook