Hijab Row in Vijayawda Loyola College: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పుడు ఏపీకి పాకింది. విజయవాడలోని లయోలా కాలేజీ యాజమాన్యం హిజాబ్ ధరించారన్న కారణంగా కొంతమంది ముస్లిం విద్యార్థినులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థినులు షాక్ తిన్నారు. విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో మత పెద్దలు అక్కడికి చేరుకుని కాలేజీ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాలేజీ యాజమాన్యం తీరుపై ముస్లిం విద్యార్థినులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా తాము ఇదే కాలేజీలో చదువుతున్నామని... ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురవలేదని పేర్కొన్నారు. కాలేజీ ఐడీ కార్డులోనూ తమ ఫోటోలు హిజాబ్‌తోనే ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం హిజాబ్ ధరించడం తమ హక్కు అని వారు పేర్కొన్నారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగడంతోనే తాము వాటిని ధరించి కాలేజీకి వస్తున్నామని అంటున్నారని.. కానీ ఫస్టియర్ నుంచే తాము హిజాబ్ ధరించి వస్తున్నామని చెప్పుకొచ్చారు.


ఏపీలో ఉన్నట్టుండి హిజాబ్ వివాదం తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి... తుది తీర్పు వచ్చేంతవరకూ విద్యా సంస్థలకు మతపరమైన దుస్తుల్లో వెళ్లడంపై నిషేధం ఉంది. మరి ఏపీలో ఎందుకని హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉంటుందా లేదా చూడాలి.


కాగా, కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో స్కూళ్లు, కాలేజీలకు 3 రోజులు సెలవులు కూడా ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత విద్యా సంస్థలను తెరవాలని ఆదేశాలిచ్చిన కోర్టు... హిజాబ్ వివాదంలో తుది తీర్పు వచ్చేంతవరకూ విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులపై నిషేధం విధించింది. ఇదే వివాదంపై పలువురు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా... వివాదాన్ని మరింత పెద్దది చేయొద్దని న్యాయస్థానం సున్నితంగా వారించింది. సరైన సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. 


Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఊసరవెల్లి ఫోటోతో కేసీఆర్‌కు బర్త్ డే విషెస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook