Home Quarantine: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases in AP) పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే 60ఏళ్ల పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, హెచ్‌ఐవీ బాధితులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఏపీ సర్కార్ సూచించింది. COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త
భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వీరిని 30 రోజులపాటు హోం క్వారంటైన్ (Home Quarantine in AP)లో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని, వ్యాధిగ్రస్తులకు కోవిడ్19 త్వరగా సోకే అవకాశం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ సోకే అవకాశాలు వీరికే అధికంగా ఉన్నాయని, కుటుంబసభ్యులు 60ఏళ్ల పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను Home Quarantineలో మరింత జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య
ఏపీలో ఇదివరకే 64 వేల 713 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 823 మంది మరణించారు. రాష్ట్రంలో కొందరు ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదని ఏపీ సర్కార్ హెచ్చరించింది. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్