న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదోతరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాల కోసం www.cisce.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని  సూచించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ఏపీ లాసెట్‌-2018 ఫలితాలు


 ఏపీ లాసెట్‌-2018 ఫలితాలను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇన్‌ఛార్జి ఉపకులపతి శుభ సోమవారం విడుదల చేయనున్నారు. ఫలితాలను www.rtgs.ap.gov.in, https: //sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.


నేటి నుంచి టీఎస్ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు


తెలంగాణలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,20,549 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 1,25,960 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాస్తుండగా 1,42,793 మంది సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. ఫస్టియర్ పరీక్షలు 9:30am- 12:00pm వరకు, సెకండియర్  పరీక్షలను  2:30pm- 5:30pm వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.


నేటి నుంచి టీఎస్ పాలిసెట్‌-2018  కౌన్సెలింగ్‌


తెలంగాణలో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. 18వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, 15 నుంచి 19వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన, 15 నుంచి 21వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు,  23వ తేదీన తొలి దశ సీట్లు కేటాయింపు ఉంటుంది. జూన్‌ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 38,612 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://polycetts.nic.in/Default.aspx ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.