హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు.. ఆ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అలాగే అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలోనూ పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


ఇదిలావుంటే, ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కురుస్తున్న వర్షాలతో వివిధ నదులు ఉప్పొంగి ప్రవహించడంతోపాటు ప్రాజెక్టులు వరద నీటితో నిండుతున్నాయి.