హైదరాబాద్‌: తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా... పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా తిరుమల, రేణిగుంటతో పాటు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.