Weather Report: తస్మాత్ జాగ్రత్త.. గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న పిడుగుల ప్రమాదం
IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
AP Weather Report: నిన్న మొన్నటి వరకు రోల్లు పలిగేంత ఎండలు కొట్టి జనాలను బయటకు వెళ్లనివ్వలేదు. ఉదయం పది గంటలు దాటితే జనాలు బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఒక్కసారిగా వాతావరణం మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడకున్నా కూడా వాతావరణం చల్లబడింది. ఎండల వేడికి ఈ కొన్ని రోజులు అయినా ఉపశమనం అనుకుంటూ ఉండగా వాతావరణ శాఖ అధికారులు మరియు విపత్తు నిర్వహణ సంస్థ లు చేసిన ప్రకటన ఏపీ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో పిడుగుపాటు ప్రమాదం పొంచి ఉందని.. తప్పకుండా రెండు జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో నేడు సాయంత్రం వరకు పలు జిల్లాల్లో భారీ ఎత్తున వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.. అంతే కాకుండా వర్షం సమయంలో ఉరుములు మెరుపులతో ఆకాశం అత్యంత భయంకరంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ ఎత్తున పిడుగు పడే అవకాశాలు ఉన్న కారణంగా ప్రజలు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలను హెచ్చరించారు. వాయువ్య మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు అల్ప పీడన ద్రోణి ప్రభావం వల్ల భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 12 గంటలు అత్యంత కీలకం అని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధ్యం అయినంత వరకు ప్రజలు బయటకు వెళ్ళవద్దని అధికారులు మీడియా ద్వారా సూచిస్తున్నారు. మరో వైపు పిడుగు పాటకు సంబంధించిన విషయాన్ని గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రచారం చేస్తూ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read: YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడిని ప్రశ్నించిన సీబీఐ
ఎండలు.. ఉక్కపోత నుండి ఉపశమనం అనుకున్న ఏపీ జనాలు భారీ వర్షాలు మరియు పిడుగు పాటుకు భయాందోళనకు గురి అవుతున్నారు. సోమవారం కూడా ఏపీలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్ప పీడన ద్రోణి కారణంగా తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది. నిన్న మొన్నటి వరకు ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ తెలంగాణ ప్రజలు కూడా కాస్త చల్లబడ్డారు. ఈ ద్రోణి ప్రభావం తర్వాత మళ్లీ ఎండలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK