విజయవాడ: ఏపీలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించిన ఏపీ సర్కార్.. పశ్చిమగోదావరి జిల్లాకే చెందిన మరో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించింది. 


కడప- బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, 
అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, 
కర్నూలు- బొత్స సత్యనారాయణ,
చిత్తూరు- మేకపాటి గౌతమ్‌ రెడ్డి, 
విజయనగరం జిల్లా- చెరుకువాడ శ్రీరంగనాథ రాజు,  
శ్రీకాకుళం-వెల్లంపల్లి శ్రీనివాస్‌, 
విశాఖ- మోపిదేవి వెంకటరమణ, 
కృష్ణా జిల్లా-కన్నబాబు, 
గుంటూరు- పేర్ని నాని, 
ప్రకాశం-అనిల్‌కుమార్‌ యాదవ్‌, 
నెల్లూరు జిల్లాకు సుచరితను ఇన్‌చార్జ్ మంత్రిగా నియమిస్తూ ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.