ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు ఐటీ దాడుల కలకలం రేగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా షేక్ కుటుంబసభ్యుల ఇంట్లో ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంటురు ఈస్ట్ అధికార పార్టీ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా షేక్ కుటుంబసభ్యుల ఇంట్లో ఇవాళ ఐటీ దాడులు జరిగాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కనుమ..ముస్తఫా వ్యాపార లావాదేవీలన్నీ స్వయంగా చూస్తుంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. గుంటూరు తూర్పు నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు గెలిచిన ముస్తఫా..ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తన కుమార్తెను రంగంలో దింపేందుకు ఆలోచిస్తున్నారు. ఆర్ధిక సమస్యలే తన నిర్ణయానికి కారణమన్నారు ముస్తఫా. 


ఇటీవలి కాలంలో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. కుమార్తెను రాజకీయాల్లో దింపి..తాను వ్యాపారం చూసుకోవాలనుకుంటున్నట్టు ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. 


ఉదయం నుంచి ఐటీ దాడులు ఎమ్మెల్యే ముస్తఫా ఇంటితో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువుల ఇళ్లలో కూడా కొనసాగుతున్నాయి. గుంటూరు అధికార పార్టీ ఎమ్మెల్యేతో ప్రారంభమైన ఐటీ దాడులు ఇక ఇతర ఎమ్మెల్యేల ఇళ్లపై కూడా జరగనున్నాయనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి.


Also read: Global Investment Summit: మార్చ్ 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతా సిద్ధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook