గుంటూరు: గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసం, కార్యాలయాలతోపాటు ఆయన ఎన్నికల ప్రధాన ఏజెంట్ పట్టాభిపురం సుధాకర్ రెడ్డి నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో వేణుగోపాల్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177900","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆదాయ పన్ను శాఖ అధికారుల వరుస దాడులతో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏ క్షణం ఏవైపు నుంచి ఎటువంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అనుక్షణం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది.