Regular trains: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లు నిలిచిపోయాయి. కరోనా సమయంలో నిలిచిపోయిన రైళ్లను ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ పునరుద్ధరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరికొన్ని రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ (Corona virus) కారణంగా ఏడాదిగా రెగ్యులర్ రైళ్లన్నీ(Regular trains) నిలిచిపోయి..కేవలం కోవిడ్ స్పెషల్ లేదా ఫెస్టివల్ స్పెషల్ మాత్రమే తిరుగుతున్నాయి. రెగ్యులర్ రైళ్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణీకులు ఎదురుచూస్తున్న పరిస్థితి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండటంతో రైల్వేశాఖ ఒక్కొక్కటిగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే(South Central railway) మరి కొన్నిరైళ్లను ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. ఆ రైళ్ల వివరాలివే..


ఏప్రిల్ 1 నుంచి 12 రైళ్లు ( Regular trains from april 1 ) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విజయవాడ మీదుగా 110 రైళ్లు తిరుగుతున్నాయి. విజయవాడ-సాయినగర్ షిర్డి-విజయవాడ మధ్య రెండు రైళ్లు, విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు, గూడూరు-విజయవాడ-గూడురు, నర్శాపుర్-ధర్మవరం-నర్శాపూర్ మార్గాల్లో రెండేసి రైళ్ల చొప్పున తిరిగి ప్రారంభించబోతున్నారు. షిర్డి, సికింద్రాబాద్, విశాఖపట్నం, ధర్మవరం, గూడురులకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు కూడా రానున్నాయి. కరోనా వైరస్‌కు ముందు విజయవాడ (Vijayawada) జంక్షన్ మీదుగా రోజుకు 250 రైళ్లు నడిచేవి. మరోవైపు ప్యాసెంజర్ రైళ్లను ఇంకా పునరుద్ధరించలేదు. 


Also read: Harish Rao On Vizag Steel Plant: మొన్న KTR, నేడు హరీష్ రావు, ఉక్కు ఉద్యమంపై పిడికిలి బిగించాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook