Summer Special Trains: వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. అదే సమయంలో స్కూళ్లు, పాఠశాలలకు సెలవులిచ్చేయడంతో ప్రయాణాలు అధికమౌతాయి. సొంతూళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అందుకే వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు, బస్సులు రష్‌గా ఉంటాయి. మూడు నెలల ముందే టికెట్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆకశ్మిక ప్రయాణాలంటే ఇక ఆశలు వదులుకోవల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్సార్టీసీ ,తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి కొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లు ప్రారంభించింది. విశాఖపట్నం నుంచి బెంగళూరు మధ్య ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. 


విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలు నెంబర్ 08549 సమ్మర్ స్పెషల్ రైలు ఏప్రిల్ 27 నుంచి జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో మద్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 


ఇక ఇదే రైలు బెంగళూరు నుంచి ఏప్రిల్ 28వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 08550 జూలై 30 వరకూ నడుస్తుంది. బెంగళూరులో మద్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 


ఇవి కాకుండా విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, విజయవాడ నుంచి చెన్నైకు మరి కొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. వేసవి రద్దీ పెరిగితే మరికొన్ని రైళ్లు ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. వేసవి రద్దీని పరిగణలో ఉంచుకుని భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 9,111 ప్రత్యైక రైళ్లు నడపనుంది. గత ఏడాది 6,369 స్పెషల్ రైళ్లు నడిపింది. ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 3 వేల రైళ్లు ఎక్కువగా నడపాలని ప్లాన్ చేస్తోంది. 


Also read: Anakapalli Loksabha: ఆ సీటులో వైసీపీ అభ్యర్థి మార్పు..! ఆయనకే టికెట్ కన్ఫార్మ్..?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook