Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత ధనవంతుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. అతడి సంపద దేశంలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థికి లేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ధనవంతుడైన లోక్‌సభ అభ్యర్థి మన తెలుగోడే. అతడే పెమ్మసాని చంద్రశేఖర్‌. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్‌ ఆస్తులు నివ్వెరపరుస్తున్నాయి. అధికారికంగానే 6 వేల కోట్లకు చేరువగా ఆస్తులు ఉండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు ఎంత ఖరీదయ్యాయో ఆయనను చూస్తే అర్థమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?


 


జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా సోమవారం చంద్రశేఖర్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఆస్తిపాస్తుల అఫిడవిట్ కూడా సమర్పించారు. అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌ ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు. అతడి వద్ద పెద్ద ఎత్తున విలాసవంతమైన కార్లు, బంగారు వజ్ర వైఢూర్యాలు, భారీగా భూములు, వాణిజ్య భవనాలు ఉన్నాయి.

Also Read: Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా


 


భారీగా వ్యవసాయ భూములు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు చంద్రశేఖర్‌తోపాటు ఆయన సతీమణి శ్రీరత్న పేరిట ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాతోపాటు హైదరాబాద్‌, ఢిల్లీ, అమెరికాలో ఆ దంపతులకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తల పేరిట ఉన్న స్థిరాస్తులు విలువనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటాయి. వీరి ఆస్తిపాస్తుల చిటటా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఆస్తుల చిట్టా ఇదే..
చంద్రశేఖర్‌ పేరిట చరాస్తులు రూ.2,316 కోట్లు
భార్య శ్రీరత్న పేరిట చరాస్తులు రూ.2,280 కోట్లు
ఇక వీరిద్దరి పేరిట షేర్‌ మార్కెట్‌లో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. 
అప్పుల విషయానికి వస్తే రూ.519 కోట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపర్చారు.


కార్లు
రూ.6.11 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన 4 కార్లు ఉన్నాయి.
బ్యాంకు ఖాతాలో..
రూ.5.9 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో ఉన్న నగదు.
ఆభరణాలు
భార్యాభర్తలకు కలిపి 6.86 కోట్ల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
స్థిరాస్తులు
గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూమి.
హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి
రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం
ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం.
అమెరికాలో రూ.6.32 కోట్ల విలువైన భూములు ఉన్నాయి.


భార్య శ్రీరత్న స్థిరాస్తులు
కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువైన వ్యవసాయ భూమి
ఢిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం.
అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు


ఎవరు పెమ్మసాని చంద్రశేఖర్‌?
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ విదేశాల్లో స్థిరపడ్డారు. వైద్య విద్య అభ్యసించి విదేశాల్లో పేరుమోసిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. అక్కడ అధ్యాపకుడిగా, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో భారీగా సంపాదించారు. పెమ్మసాని ఫౌండేషన్‌ పేరిట ఆంధ్రప్రదేశ్‌లో, విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రశేఖర్‌ తండ్రి తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా పెమ్మసాని చంద్రశేఖర్‌ అండగా నిలిచారు. ఎన్నారై పరంగా టీడీపీకి భారీ సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తింపుగాను తాజా ఎన్నికల్లో గుంటూరు టీడీపీ ఎంపీ టికెట్‌ దక్కింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter