Indigo Airlines: రాయలసీమ వాసులకు మరో గుడ్‌న్యూస్. కర్నూలు నుంచి అదనపు విమానసేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు అదనంగా మరో సర్వీసు వచ్చి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలు ఎక్కువ. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలతో పాటు కొత్తగా కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాయి. ప్రతిరోజూ వివిధ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్న పరిస్థితి. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి ఇప్పటి వరకూ విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు ఉన్నాయి. ఇక నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల్నించి వచ్చిన వినతులు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Buggana Rajendranath Reddy) ప్రయత్నాలు ఫలించడంతో విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.


కర్నూలు నుంచి విజయవాడకు ఇక నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విమానం నడవనుంది. మార్చ్ 27 నుంచి కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. నల్లమల ఘాట్ రోడ్ సరిగ్గా లేకపోవడంతో..కర్నూలు-విజయవాడ ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.ఇక నుంచి కేవలం గంటలోపే కర్నూలు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. 


Also read: AP Corona cases: ఏపీలో టెస్టులు తగ్గినా.. భారీగా పెరిగిన కరోనా కేసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook