దేశంలోనే అత్యధిక విమాన సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నడుస్తున్నాయని పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతి రాజు తెలిపారు. ఆదివారం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి విమానాశ్రయం నుండి ఇండిగో సేవలను ప్రారంభించారు. హైదరాబాద్‌కు మూడు, బెంగళూరుకు రెండు విమాన సేవలను ప్రారంభించారు. 


"ప్రపంచంలో దేశీయ విమానాల రాకపోకల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. దాదాపు దేశంలో అన్ని నగరాలకు విమానయాన సౌకర్యం కల్పిస్తున్నాము. విమానయానం మరింత అభివృద్ధి చెందడం సంతోషకరం. తిరుపతి నుంచి ఇండిగో విమాన సర్వీసులు ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దేశంలోనే అత్యధిక విమాన సర్వీసులు ఏపీలోనే నడుస్తున్నాయి" అని అన్నారు.