కోల్ కతా పర్యటనలో ఉన్న చంద్రబాబు మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం సెక్యూలరీజానికి విరుద్ధపాలన చేస్తోందని విమర్శించారు. మోడీ పాలనలో మైనార్టీలు  భద్రతను కోల్పోయి భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. మైనార్టీలతో పాటు దళితులు, బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతే ఉందన్నారు. బీజేపీ పాలనలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరలు పెంచడం..నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ వ్యతిరేక కూటమి భేటీ వాయిదా


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. ఆర్బీఐ, ఈడీ, సీబీఐలాంటి వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కీలక వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని... ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు