తెలుగు ద్రవిడ భాష. తెలుగు భాషను మాట్లాడే వారందరినీ ఆంధ్రులంటారు. "త్రిలింగ" పదము నుండి పుట్టిన పదమే "తెలుగు". నన్నయకాలం నాటికే తెలుగు, ఆంధ్రము అనే పేర్లు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగు భాష గురించి, తెలుగు వారి గురించి తెలియని కొన్ని సంగతులను మనం కూడా తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం తెలుగువారు (ఆంధ్రులు) మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన పోరాడారట.


*అమరావతిలో  ఓ శాసనంపై కనిపించే నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. దీనిని బట్టి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే తెలుగు భాష ఉనికి ఉందని చెప్పుకోవచ్చు. 


*క్రీ.శ. 1వ శతాబ్ధిలోనే హాలుడు రాసిన గాధా సప్తశతిలో కూడా కొన్ని తెలుగు పదాలు కనిపించడం విశేషం.


*శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదని ఓ వాదన ఉంది. 


*క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన కన్నడ భాషనుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయని కొందరు అంటూ ఉంటారు.


*తెలుగు భాష మూలపురుషులు యానాదులని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది.  నల్లమల అడవుల నుంచి నెల్లూరు సముద్రతీరం వరకూ విస్తరించిన గిరిజన జాతివారే యానాదులు.


*తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించిందని... అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారని కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. 


*మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్, భిల్లీ భాషలకు, తెలుగుకు సంబంధముందని అంటారు,


*తెలుగు భాషకు వ్యాకరణాన్ని రావణాసురుడు రాశాడని కూడా ఓ కథ ప్రచారంలో ఉంది.