Who is Next Tuda Chairman: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ కొలువుదీరి దాదాపు ఐదు నెలలు దాటింది. దాంతో కీలకమైన కార్పొరేషన్‌ పదవులను కూటమి నేతలకు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే తొలిదశలో చాలా పోస్టులు భర్తీ చేశారు. త్వరలోనే రెండో లిస్టు రాబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సారి టీడీపీ నేతలతో పాటు.. జనసేన, బీజేపీ నేతలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తారని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి తుడా చైర్మన్‌ పదవి ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఈ పదవి కోసం మూడు పార్టీల నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 8th Pay Commission Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, భారీగా పెరగనున్న జీతాలు, ఎప్పుడంటే


ఇక దేశంలోనే అత్యంత ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఓకటి.. తిరుమల క్షేత్రానికి ప్రతిరోజు లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్‌ కొలువై ఉండటంతో తిరుపతి తుడా చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తుడా చైర్మన్ పోస్టు దక్కితే దేశమంతా గుర్తింపు దక్కుతుందని నేతలు భావిస్తున్నారు.. అందుకే తుడా చైర్మన్‌పై మూడు పార్టీల నేతలు కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఆశావాహులు తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు పాడిగాపులు కాస్తున్నారట. ఎలాగైనా సరే ఈసారి తుడా చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నరట..


ఇక తూడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్న లీడర్ల చాంతడంతా ఉందట.. ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలు తుడా చైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఇందులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నాయుడు తుడా చైర్మన్ రేసులో ముందున్నారట. ఇక వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తుడా చైర్మన్ గా కొనసాగారు. ఇప్పుడు ఇదే పదవిని నగరి ఎమ్మెల్యే బానుప్రకాష్ నాయుడు ఆశిస్తున్నారు. మరోవైపు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తుడా రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో తనకు ఎమ్మెల్యే సీటు దక్కలేదని అందుకే  తన పేరు తుడా ఛైర్మన్ కి పరిశీలించమని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరుతున్నారట. మరోవైపు  చంద్రగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు మీద ఉన్న డాలర్ దివాకర్ రెడ్డి సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తిరుపతి కి చెందిన టిడిపి సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. 


మరోవైపు ఈసారి తుడా చైర్మన్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని జనసేన కూడా అనుకుంటోందట. తుడా చైర్మన్ పదవి దక్కింతే తిరుపతిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతల ఆలోచనగా ఉందట. అందుకే ఈసారి తుడా చైర్మన్ పై ఆ పార్టీ నేతలు కన్నేసినట్టు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, డాక్టర్ హరిప్రసాద్ లు ప్రయత్నిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కోలా ఆనంద్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. మొత్తంగా తుడా చైర్మన్ గా ఎవరిని నియమిస్తారని మూడు పార్టీల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. 


Also read: 8th Pay Commission Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, భారీగా పెరగనున్న జీతాలు, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.