సంక్రాంతి బరిలో `ఇంటర్నేషనల్` కోళ్ళు..!
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలలో జరిగే కోళ్ళ పందేలలో ఈ సారి పలు కోళ్ళను విదేశాల నుండి తెప్పించి బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నారు పలువురు ఔత్సాహికులు
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలలో జరిగే కోళ్ళ పందేలలో ఈ సారి పలు కోళ్ళను విదేశాల నుండి తెప్పించి బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నారు పలువురు ఔత్సాహికులు. ముఖ్యంగా ఇండోనేషియా, తైవాన్, పాకిస్తాన్ నుండి బాగా తర్ఫీదు పొందిన కోళ్ళను కొని ఈ సారి దేశీయ కోళ్లతో పోటీగా బరిలోకి దించాలని చూస్తున్నారు.
అయితే ఈసారి కోళ్ల పందేలను ఏపీలో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా.. అన్న దానిపై ఎలాంటి స్పష్టత కూడా లేదు. ప్రస్తుతం విదేశాల నుండి కోళ్ళను తెప్పించే ప్రక్రియలో కొన్ని ఆన్‌లైన్ వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందించడం విశేషం. దాదాపు ఒక్కో కోడి ఖరీదు 5 నుండి 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందనేది ఒక అంచనా. అయితే ఈ కోళ్ళు దేశీ కోళ్ళతో పోటీపడి ఎంతవరకు గెలుస్తాయన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయమే