Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నాలుగైదు రోజులుగా కనిపించడం లేదు. దసరా నుంచి జనసేన చీఫ్ బస్సు యాత్ర చేస్తారని గతంలో జనసేన వర్గాలు ప్రకటించాయి. కాని ఇటీవలే  బస్సు యాత్ర వాయిదా ప్రకటించారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. జనసేనానికి హైదరాబాద్ తో పాటు మంగళగిరిలో నివాసాలున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ హైదరాబాద్ లో లేరు. అటు మంగళగిరిలోనూ లేరు. దీంతో పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అమెరికాలోని టెక్సాస్ లో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన వర్గాలు మాత్రం పవన్ ఎక్కడున్నారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బస్సుయాత్రకు సిద్ధపడిన పవన్ కల్యాణ్ ఎందుకు వాయిదా వేశారన్నది చర్చగా మారింది. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ చేశారని.. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశాకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే బస్సు యాత్ర వాయిదాకు అసలు కారణం ఇది కాదని తెలుస్తోంది. ఆర్థిక వనరులు లేకపోవడమే కారణమంటున్నారు. బస్సు యాత్రతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భారీగా నిధులు అవసరం. డబ్బులు లేకుండా పార్టీ నడపడం అసాధ్యం. అందుకే ఇప్పుడు  నిధుల సేకరణలో పవన్ ఉన్నారంటున్నారు. ఆ పని మీదే ఆయనకు అమెరికాకు వెళ్లారంటున్నారు. అమెరికాలోని తెలుగు ఎన్నారైలతో  జనసేన చీఫ్ సీక్రెట్  మీటింగ్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లోనే ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారంటున్నారు.


ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది జనసేన. పార్టీ బలోపేతం కోసం జిల్లా పర్యటనలు కూడా చేశారు పవన్ కల్యాణ్. ఆత్మ హత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన తరపున సాయం అందించారు. కడప సహా పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. జగన్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. వైసీపీని ఓడిచేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించడం సంచలనమైంది. పవన్ వ్యాఖ్యలను స్వాగతించేలా చంద్రబాబు మాట్లాడారు. దీంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమనే చర్చే కొన్ని రోజులుగా ఏపీలో సాగుతోంది.అమెరికా నుంచి రాగానే పార్టీకి సంబంధించి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. పొత్తులపై వీలైనంత త్వరగా తేల్చి జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


Also Read: Munugode Bypoll: మునుగోడులో బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్ బేజారు! మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్...


Also Read: Jr NTR Foot Nara Dogs: జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గర నారా కుక్కలు.. సోషల్ మీడియాలో రచ్చ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి